అశ్వనీ దత్ గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. అయితే ట్రెండ్ మారిన తరువాత ఆయన హవా తగ్గిపోయింది. అయితే నిర్మాతగా ఆయన వారసురాలుగా ఎంట్రీ ఇచ్చిన స్వప్నా దత్ సాధిస్తున్న ఘన విజయాలు చూసి అందరూ ఆశ్చర్య పడుతున్నారు. నేటితరం ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయిన సావిత్రి జీవితాన్ని ‘మహానటి’ మూవీగా తీసి ఘనవిజయం సాధించడంతో ఆమె పేరు మారుమ్రోగి పోయింది.


సాధారణంగా మంచి సినిమాలు ఆర్థికంగా విజయాన్ని సాధించవు. అయితే ఈవిషయంలో స్వప్నా దత్ అంచనాలు వేరు అన్నవిషయం లేటెస్ట్ గా విడుదలైన ‘సీతా రామం’ మూవీ మరొకసారి రుజువు చేసినట్లుగా అనిపిస్తోంది. వాస్తవానికి ఈ మూవీకి దర్శకత్వం వహించిన హను రాఘవపూడి ఈ మూవీ విడుదలకు ముందు వరస ఫ్లాప్ లలో ఉన్నాడు. భారీ అంచనాలతో విడుదలైన ‘పడిపడి లేచె మనసు’ ఫ్లాప్ కావడంతో దర్శకుడుగా హను రాఘవ పూడి మార్కెట్ బాగా పడిపోవడంతో అతడితో సినిమాలు చేయడానికి ఎవరు ముందుకురాలేదు.


ఇలాంటి పరిస్థితులలో స్వప్న హను రాఘవపూడిని నమ్మి ఈమూవీ పై 35కోట్లు ఖర్చు పెట్టింది అంటున్నారు. వాస్తవానికి ఈ మూవీని మొదట్లో 20 కోట్లతో పూర్తి చేయాలని భావిస్తే ఈసినిమా రకరకాల లోకేషన్స్ లో తీయడంతో పాటు సహజత్వం కోసం ఎక్కువ రోజులు ఈ మూవీ షూటింగ్ రోజులు పెరగడంతో ఈమూవీ బడ్జెట్ పెరిగింది అంటున్నారు.


అయితే హను రాఘవపూడి పై స్వప్న పెట్టుకున్న విపరీతమైన నమ్మకం ఈమూవీ విజయానికి కారణమైంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీ కథను ఆసక్తికరంగా నడిపించడంలో ‘మహానటి’ మూవీకి అందించిన స్క్రీన్ ప్లే టెక్నిక్ ను మరొకసారి రిపీట్ చేయడంతో సగటు ప్రేక్షకుడు చాల సులువుగా ఈమూవీకి కనెక్ట్ అయ్యాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెన్స్ బుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన హను రాఘవపూడికి ఈమూవీ మరొక టర్నింగ్ పాయింట్ గా మారడంతో ఇతడి నుండి మరిన్ని మంచి సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: