ఒకానొక సమయంలో బ్యాక్ గ్రౌండ్ డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన శేఖర్ మాస్టర్ కొన్ని సంవత్సరాలు తర్వాత అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసే ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు. ఒకవైపు సినిమాలలో డాన్స్ కంపోజ్ లు  చేస్తూ హిట్స్ అందిస్తూనే.. మరొకవైపు బుల్లితెరపై పలు షో లలో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఈటీవీలో వస్తున్న ఢీ డాన్స్ ప్రోగ్రాం ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఆ షోలో ఇప్పుడు కొనసాగడం లేదు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మాటీవీలో కామెడీ స్టార్స్ అనే కామెడీ షోలో నాగబాబు తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు.

ఇకపోతే తన డాన్స్ కంపోజిషన్ కి సినిమాల ద్వారా ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఈయన..తాజాగా వ్యక్తిగత విషయాలను ఇటీవల వెల్లడించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ చేరాల్సిన నేను డాన్స్ కోసం హైదరాబాద్ కి వచ్చేసాను. ఇక ఇంట్లో అమ్మానాన్నను అడిగితే డబ్బులు ఇస్తారు. కానీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని.. నా ఇబ్బందులు వాళ్లకు తెలిస్తే బాధపడతారని అందుకే నా సమస్యలను వాళ్లకు ఎప్పుడూ చెప్పేవాడిని కాదు. ఇక ఒక పూట బాగా తింటే చాలు అని ఆలోచించే రోజులవి.. ఎక్కడైనా ఫంక్షన్స్ ఉంటే అక్కడికి దొంగ చాటుగా వెళ్లి తినేవాళ్ళము. ఇక కొద్ది రోజులు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలలో నటించాను అంటూ శేఖర్ మాస్టర్ వెల్లడించారు.

ఇక అప్పుడు కేవలం 75 రూపాయలు మాత్రమే రోజుకు ఇచ్చేవారు అని,  అదే చాలా ఎక్కువగా అనిపించేది అని ఇక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో చాలామంది స్నేహితులు, తెలిసినవారు ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పడంతో పాటు సెక్యూరిటీ గార్డు లాగా పని ఇప్పిస్తామని నాకు చెప్పేవాళ్లు .. కానీ డాన్స్ నుండి పక్కకు పోయి జాబ్ చేస్తే డైవర్ట్ అవుతాననే భయం వేసేది. అందుకే ఇబ్బంది పడినా.. ఇందులోనే ఉండాలని అనుకున్నాను అంటూ ఆయన తెలిపారు . ఇక ఒక గ్రూప్ డాన్స్ లో కూడా డాన్స్ చేశానని, లారెన్స్ మాస్టర్, సుచిత్ర మాస్టర్ దగ్గర పని చేశాను అంటూ తన కెరీర్ లో పడిన కష్టాలను చెబుతూనే కన్నీటి పర్యంతమయ్యారు శేఖర్ మాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: