‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ప్రభాస్ ను అభిమానించేవారు ఎంతమంది ఉంటారో ప్రభాస్ ను విమర్శించే యాంటీ ఫ్యాన్స్ కూడ చాలామంది ఉంటారు. ప్రభాస్ కు డాన్స్ రాదనీ హృదయానికి హత్తుకుపోయేలా సున్నితమైన పాత్రలలో ప్రభాస్ నటించి మెప్పించలేడనీ కొందరు యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న ప్రక్రియ.


ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడల్లా ఆ కామెంట్స్ ను తిప్పికొడుతూ సోషల్ మీడియా ద్వారా డార్లింగ్ అభిమానులు చాల గట్టిగా సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు  ‘సీతా రామం’ ఘనవిజయం సాధించడంతో ఆసినిమాను ప్రభాస్ నటించిన  ‘రాథే శ్యామ్’ తో పోలుస్తూ కొందరు యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ఘన విజయం సాధించిన ‘సీతా రామం’ కేవలం 35 కోట్ల బడ్జెట్ తో తీస్తే అదే ‘రాథే శ్యామ్’ మూవీని 300 కోట్లతో తీసి నిర్మాతలు చేతులు కాల్చుకున్నారని యాంటీ ఫ్యాన్స్ వాదన. అంతేకాదు ఈ రెండు సినిమాల కథలు ప్రేమ కథలే అయినప్పటికీ సగటు ప్రేక్షకుడు ‘సీతా రామం’ కథకు కనెక్ట్ అయిన విధంగా ‘రాథే శ్యామ్’ కథకు కనెక్ట్ కాలేకపోయారు అన్నది ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ అభిప్రాయం.


‘రాథే శ్యామ్’ సినిమా కోసం కోట్లు ఖర్చుపెట్టి భారీ సెట్స్ వేసిన విధంగా ‘సీతా రామం’ మూవీలో ఎలాంటి భారీ సెట్స్ లేవనీ కామెంట్స్ చేస్తూ ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ ఒక సినిమాను ఎలా తీసి మెప్పించాలో నేటి టాప్ హీరోలు తమ సినిమాలకు సంబంధించిన విషయాలలో ‘సీతా రామం’ ను చూసి పాఠాలు నేర్చుకోవాలి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు ప్రభాస్ అభిమానులు ‘రాథే శ్యామ్’ మూవీని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అని భావిస్తూ ఉంటే ‘సీతా రామం’ ను చూసిన కొందరు మళ్ళీ ‘రాథే శ్యామ్’ ప్రస్తావన తీసుకు రావడం ఒకవిధంగా డార్లింగ్ అభిమానులకు మరింత నిరాశపరిచే విషయం అనుకోవాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: