మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా వీరి కలయికలో సినిమా రాబోతుందని చాలామంది అభిమానులు అనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు వీరు కలిసి సినిమా చేయకపోవడం వారిని నిరాశపరిచింది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ లో సినిమా రూపొందుతుందని వీరిద్దరూ కూడా గతంలో వెల్లడించడం జరిగింది. దాంతో ఈ సినిమా రూపొందించడం ఖాయం అని వారు అనుకుంటున్నారు.

ప్రస్తుతం మహేష్ తన 28వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ పనులను పూర్తిచేసిన త్రివిక్రమ్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు చిత్రాల కంటే భారీ నేపథ్యమున్న కథతో ఈ చిత్రం రూపొందుతుంది. త్రివిక్రమ్ సినిమాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా మిళితమై ఉంటుంది.

అలాంటి ఒక మంచి కథను మహేష్ కోసం రూపొందించి ఇప్పుడు ఈ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా పూర్తయి తర్వాత రాజమౌళి సినిమాను మొదలు పెట్టాలనుకుంటున్నాడు మహేష్ బాబు. వచ్చే ఏడాది రాజమౌళి సినిమాను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సినిమా గురించి ప్రస్తావన రాగా ఆ సినిమాను వచ్చే ఏడాది కాకుండా ఈ ఏడాదినే మొదలుపెట్టాలని సంకల్పంతో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ కల్లా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి డిసెంబర్లో రాజమౌళి సినిమాను మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడట. మరి సడన్ గా రాజమౌళి సినిమాను ముందే చేయాలని భావించడం పట్ల మహేష్ ఆలోచన ఎటువంటిదో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత కూడా మహేష్ కొన్ని సినిమాలు చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మరిన్ని సినిమాలు చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: