అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 11వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ శేరవెగంగా చేస్తుంది చిత్ర బృందం. తెలుగులో నాగచైతన్య కేంద్రంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా తరలిరావడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సీనియర్ హీరోలైన నాగార్జున మరియు చిరంజీవి ఇద్దరు చైతన్య మరియు అమీర్ ఖాన్ లతో ఇంటర్వ్యూ చేసి సినిమా ను పై క్రేజ్ పెరిగేలా చేయడం విశేషం.

హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన నేపథ్యంలో దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను అమీర్ ఎంతో గ్రాండ్ గా చేస్తున్నాడు. ఆ విధంగా తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తూ ఉండడం విశేషం.  ఇందులో మంచి అంశాలు ఉన్న కారణంగా ఈ సినిమాను తాను సమర్పించడానికి సిద్ధమయ్యానని చిరంజీవి వెల్లడించారు. ఇకపోతే తనయుడు నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ కి నాగార్జున తనవంతు సహకారం చేస్తున్నాడు.

మరి ఇప్పటికే బయట పలు నెగిటివ్ ప్రచారాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం ఏ విధంగా విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కంటెంట్ ను నమ్ముకుని దానికి తగ్గ నటనను చేస్తూ మంచి సినిమాలను చేసిన అమీర్ ఈ సినిమాతో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. మరి తొలిసారి బాలీవుడ్ లో సినిమా చేసిన నాగచైతన్య ఈ చిత్రం ద్వారా అక్కడి ప్రేక్షకులను ఎంతగా అలరిస్తాడో చూడాలి. తెలుగులో ఆయన చేసిన గత సినిమా థ్యాంక్యూ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. మరి ఈ సినిమా అయినా ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టి ఆ ఫ్లాప్ ను కవర్ చేస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: