కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సారా చిత్రం ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఇంతటి స్థాయి విజయాన్ని అందుకోలేదని చెప్పాలి. మంచి కథతో చక్కటి స్క్రీన్ ప్లే తో వచ్చే ఏ సినిమా అయినా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది అని చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ. ఓ కొత్త దర్శకుడు అయిన కూడా ఈ సినిమాను ఆయన మలిచిన విధానం ఎంతో అద్భుతపరిచింది. ప్రతి ఒక్క సీన్ కూడా ఆయన మలుచుకున్న విధానం చాలా బాగుంది.

ఆ విధంగా కళ్యాణ్ రామ్ ఎఫెక్ట్స్ కి ఈ సినిమా విజయం రావాల్సిందే అని చెప్పవచ్చు. లేకపోతే చాలా రోజుల తర్వాత తెరకెక్కి విజయం కావడంతో ఆయన అభిమానులు కొంత అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ట్రెండును చేశారు. అది కొంత బెడిసి కొట్టింది అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమాకు ఏదైనా మైనస్ ఉంది అంటే అది అభిమానుల అత్యుత్సాహం వల్లే వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం కూడా ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించి కళ్యాణ్ రామ్ అధికారికంగా చెప్పటం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. బింబిసార ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ కలిగి ఉన్నాడు అనే దానిపై ఈ సినిమా ఉండబోతుంది అని అంటున్నారు. మరి ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించే విధంగా చేసి మరొక భారీ విజయాన్ని వీరు అందుకుంటారా అనేది చూడాలి. తాజాగా ఈ సినిమాను మరిన్ని భాషలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొద్ది రోజులలోనే హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి అక్కడ కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని అందుకుంటారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: