టాలీవుడ్ లో అగ్ర కథానాయికలు తీసుకునే పారితోషకం ఏ స్థాయిలో ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల కాలం లో హీరోలు హీరోయిన్లు ఇద్దరు కూడా భారీ స్థాయి లో తమ పారితోషకాలను పెంచారు. ఆ విధం గా టాలీవుడ్ లో నెంబర్ వన్ కథానాయక గా మారిన రష్మిక భారీ స్థాయి లో పారితోషకాన్ని పెంచడం ఇప్పుడు చిన్న నిర్మాతలు తట్టుకోలేకపోతున్నారు. తొలుత చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి పెద్ద హీరోల సరసన నటించి భారీ విజయాలు అందుకొని ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక.

ఆమె కేవలం తెలుగులో మాత్రమే కాదు తమిళ హిందీ భాషలలో సైతం నటిస్తూ అక్కడ కూడా తన క్రేజ్ను పెంచుకుంది. అయితే ఆ విధంగా వచ్చిన క్రేజ్ కారణంగా ఈమె తన పారితోషకాన్ని అమాంతంగా పెంచి వేసింది అని చెప్పాలి. హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు కంటే అక్కడే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి పరుస్తుంది. ఆ విధం గా తెలుగులో ఆమె చేస్తున్న ఏకైక సినిమా పుష్ప రెండో భాగంకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉండగా ఇప్పుడు మరొక సినిమా అవకాశం కూడా ఆమెకు వచ్చిందని తెలుస్తుంది.

సినిమా కోసం ఆమె గతంలో తీసుకున్న పారితోషకం కంటే రెట్టింపు పారితోషకాన్ని డిమాండ్ చేస్తుందట. మరి దీని ని ఆ నిర్మాణ సంస్థ ఒప్పుకొని ఆమెకు అంతటి పారితోషకాన్ని అందిస్తుందా అనేది చూడాలి. నాగచైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. పరశురామ్ దర్శకత్వం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ద్విభాష చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: