టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల ను కామిక్ వేలో రూపొందించే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారి లో ఒకరు అనిల్ రావిపూడి ఆయ న ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచకుండా వారిని ఎంతగానో అలరించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఇటీవల ఎఫ్3 సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రాని కి సంబంధించిన అధికారిక ప్రకటన రాగా త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నా యి. ఎఫ్3 సినిమా షూటింగ్ సమయం లోనే బాలకృష్ణ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను మొదలుపెట్టిన అనిల్ రావిపూడి తాజాగా ఈ సినిమా యొక్క స్క్రిప్టును పూర్తిగా రాసేసాడని అంటున్నారు. సినిమా చేయడానికి అయినా కథ రాయడానికై నా పెద్దగా సమయాన్ని తీసుకొని అని రావిపూడి ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచే మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడట.

దానికి సంబంధించిన పనులను చేస్తున్నాడట. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించి న షూటింగ్ చివరి దశలో ఉంది దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు కానీ అప్పటికి ఈ సినిమా పూర్తయ్యే విధం గా కనిపించడం లేకపోవడంతో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే బాలకృష్ణ తన పార్ట్ట్ను  ఈ నెలలో కంప్లీట్ చేసి వచ్చే నెలలో అనిల్ రావిపూడి తో చేతులు కలిపే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. మరి వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వచ్చే ఏడాది వేసవికి దీనిని విడుదల చేయాల ని భావిస్తుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: