ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కేరళలో జన్మించిన ఈమె తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ ఉంటుంది. ఇక రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును, అవును-2 వంటి చిత్రాలలో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఏవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక కెరియర్ పరంగా పూర్తిగా డౌన్ అవుతున్న తరుణంలో బుల్లితెరపై పలు షో లకు జడ్జిగా వ్యవహరించింది. దీంతో మళ్లీ అందరి చూపు ఈ ముద్దు గుమ్మ వైపు తిప్పుకుంది.

ఈ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. దీంతో పలు సినిమా అవకాశాలలో కూడా దక్కించుకున్నది ప్రస్తుతం ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నది. ఇక పాత్ర బాగుంటే స్టార్ హీరోల సినిమాలలో అయినా సహాయక పాత్రలలో నటిస్తూ ఉంది. తాజాగా తన కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను గతంలో పూర్ణానే షేర్ చేసింది. ఇక త్వరలో వివాహం అవుతుంది అనుకుంటున్న సమయంలో సోషల్ మీడియాలో పూర్ణ వివాహం క్యాన్సిల్ అయిందని ఆమె నిశ్చితార్థం కూడా రద్దు చేసుకుందని వార్తలు కూడా బాగా పెరిగిపోయాయి.
దీంతో పూర్ణ అధికారికంగా ఈ విషయంపై స్పందించకుండా సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలకు పుల్ స్టాప్ పెట్టే విధంగా తన కాబోయే భర్త షానిద్ ఆసిఫ్ ను గట్టిగా హత్తుకున్న ఒక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో నుంచి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి నువ్వు ఎప్పటికీ నా వాడివే అని క్యాప్షన్ ని కూడా పెట్టి వాటికి లవ్ సింబల్ ని కూడా జత చేసింది. ఈ ఒక్క పోస్ట్ తో తనపై వస్తున్న వార్తలకి పుల్ స్టాప్ పెట్టిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: