ఇటీవల సీతారామం సినిమాతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు హను రాఘవపూడి. అంతకుముందు ఆయన చేసే సినిమాలు బాగానే ఉన్నా కూడా పెద్దగా పేరు వచ్చేది కాదు. హను రాఘవపూడి కి అయితే ఈ చిత్రంలో పూర్తిగా తన స్టైల్ జోడించడం వల్లనే ఆయనకు ఇంతగా పేరు వచ్చింది అని చెప్పవచ్చు. ప్రేమకథ సినిమాలను తెరకెక్కించడంలో ఆయన స్టైలే వేరు. తెలుగు మణిరత్నంగా ఆయన ఈ సినిమాతో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు అని చెప్పవచ్చు.

ఆ విధంగా హను రాఘవపూడి పై ఇప్పుడు అందరి పెద్ద హీరోల దృష్టి పడింది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్ తొలి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా కూడా స్క్రీన్ ప్లే వర్కౌట్ కాకపోవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా చేరలేకపోయింది. కానీ దర్శకుడిగా తాను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఓ కొత్త రకమైన ఫీల్ ఆ సినిమాలో వచ్చే విధంగా చిత్రాన్ని చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలలో కూడా ఇదే రకమైన తప్పు రిపీట్ అవడంతో ఆయన సినిమాలకు పెద్దగా గుర్తింపు రాకుండా పోయింది.

కథ విషయంలో కాన్సెప్ట్ విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకునే హను రాఘవపూడి ఎక్కడో చేసే చిన్న పొరపాటు వల్ల చిత్రాన్ని మెజారిటీ ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్ల లేకపోయాడు. అయితే తన తప్పు ఏంటో తెలుసుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు చేసిన సీతారామం సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడితో సినిమా చేయాలని కొంతమంది యువ హీరోలు ఇప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ దర్శకుడిని ఓ సినిమా కోసం లాక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో హీరో ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఆయన తన తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: