అందాల ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనాల్ చౌహాన్ ఇప్పటి వరకు తెలుగు లో అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. సోనాల్ చౌహాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా బాలకృష్ణ మూవీ లలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోనాల్ చౌహాన్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ మూవీ ని విడుదల చేసునున్నారు. కొంత కాలం క్రితమే సోనాల్ చౌహాన్ , వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్  హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3  మూవీ లో ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇలా వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తున్న సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వాటితో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా సోనాల్ చౌహాన్ సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో సోనాల్ చౌహాన్ స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: