అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల అయ్యే సమయంలో భారీ స్థాయిలో నెగెటివిటీ రావడం చిత్రం పై సినిమా యొక్క ఓపెనింగ్ కలెక్షన్స్ పై ఎంతగానో ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన ప్రతి సినిమా విడుదల సమయంలోనూ ఇటువంటి ఇబ్బంది వస్తుంది. దాంతో ఇప్పుడు విడుదలవుతున్న చిత్రం కు కూడా ఆ నెగెటివిటీ అనేది ఎక్కువైంది అని చెప్పవచ్చు.

ఈ సినిమాను సౌత్ లో విడుదల చేసే విధంగా ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అసలే ఈ సినిమాకు సౌత్లో పెద్దగా క్రేజ్ లేని నేపథ్యంలో ఈ నెగెటివిటీ ఈ సినిమా యొక్క కలెక్షన్ల పై మరింత ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు. ఆ విధంగా అమీర్ ఖాన్ మరొకసారి ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. మరి సినిమా కంటెంట్ బాగుంది ప్రేక్షకులను అలరిస్తే తప్పకుండా చిత్రము యొక్క కలెక్షన్లు పొందుకుంటాయి. దీనికి తగ్గట్లు కలెక్షన్లు కూడా పెరుగుతాయి. మరి అమీర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించి భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. 

ఇక ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్న నాగచైతన్య పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో ఉంది. బోడి బాలరాజు గా అయన ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. హిందీ సినిమా అయినప్పటికీ తెలుగు కుర్రాడి లాగే ఈ సినిమా లో ఆయన కనిపించబోతున్నాడు. అలా చైతు ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ అందుకోబోతున్నాడు. మరి ఈ సినిమా ద్వారా అయన ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: