మలయాళ హీరోలు తెలుగులో డైరెక్ట్ సినిమాలు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇటీవల కాలంలో ఏ హీరో కూడా తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేసింది లేదు. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం తెలుగులో రెండు సినిమాలు చేసి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాడు. మమ్ముట్టి తనయుడిగా ఆయన సినిమా పరిశ్రమ లోకి వచ్చి ప్రేక్షకులను అలరించాడు. అయితే మలయాళంలో మంచి గుర్తింపు ఉన్న కూడా తెలుగులో ఈ హీరోకి అంతగా గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే మహానటి సినిమా తెలుగులో చేశాడో అప్పటినుంచి ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.

ఆ తర్వాత మళ్లీ డైరెక్ట్ గా తెలుగు సినిమా చేసే విధంగా ఆయన అడుగులు వేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. తాజాగా ఆయన నటించిన సీతారామం సినిమా ప్రేక్షకులను అలరించింది.  ఈ నేపథ్యంలోనే ఆయనకు యూత్ లో మంచి క్రేజ్ పెరిగిపోయిందని చెప్పాలి. భవిష్యత్తులో ఈ హీరో కూడా మంచి సినిమాలు చేస్తే ఇక్కడ స్టార్ హీరోగా ఎదిగే అవకాశం లేకపోలేదు. మలయాళంలో ఎలాగూ ఈ హీరో స్టార్ హీరో అయిపోయాడు కాబట్టి తెలుగులో కూడా ఈ హీరో మంచి సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగితే చూడాలనేది ఆయన అభిమానుల కోరిక.

ఇతర భాషల హీరోలు తెలుగు సినిమాలలో నటించి మార్కెట్ పెంచుకోవడం కొత్తేమీ కాదు. కమల్ హాసన్ రజనీకాంత్ సూర్య కార్తీ ధనుష్ వంటి హీరోలు తెలుగులో డైరెక్టర్ సినిమాలలో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతకు ముందు వారికి ఉన్న మార్కెట్ ను రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా వారి లాగానే దుల్కర్ సల్మాన్ ఇక్కడ భారీ స్థాయిలో మార్కెట్ ను ఏర్పరచుకుంటాడా అనేది చూడాలి.  యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న ఈ హీరో ఒక మంచి యాక్షన్ సినిమా చేస్తే తప్పకుండా మంచి గుర్తింపు దక్కించుకుంటాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: