పెద్ద హీరోలతో సినిమాలు చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద దర్శకులే వీరితో సినిమాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. కథ విషయంలో కథనం విషయంలో హీరోల ఎలివేషన్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని సదరు దర్శకులు ఆ సినిమాను విడుదల చేస్తూ ఉంటారు. అందులో ఏ మాత్రం పొరపాట్లు జరిగినా కూడా వారి వారి అభిమానులు సదురు దర్శకుడు పై విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటారు.

ఆ విధంగా పెద్ద హీరోలను హ్యాండిల్ చేయడం వారి సినిమాలను తెరకెక్కించడం అనేది ఆసామాన్యమైన విషయం అనే చెప్పాలి. అయితే ఒకే ఒక్క సినిమాతో అనుభవాన్ని కలిగిన దర్శకుడు బుచ్చిబాబు ఏకంగా ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని ప్లాన్ చేయడం నిజంగా ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వెంటనే ఈ దర్శకుడు ఒక మీడియం రేంజ్ హీరోతోనే రెండవ సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు.

కానీ ఏకంగా ఎన్టీఆర్ తో కథ ఒప్పించుకొని ఆయన కోసం ఎదురుచూసేలా చేసుకోవడం నిజంగా ఆయన స్టామినాను తెలియపరుస్తుంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ బిజీగా ఉన్న నేపథ్యంలో రామ్ చరణ్ కు ఓ కథను వినిపించాడట బుచ్చిబాబు. ఆ కథ కూడా ఆయనకు విపరీతంగా నచ్చడంతో ఈ సినిమాను కూడా రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే వారిద్దరికీ పలు కమిట్మెంట్లు ఉన్న కారణంగా ఈ దర్శకుడితో సినిమా చేయడానికి కొంత ఆలోచిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు ఆయనతో సినిమా చేయలేకపోయినా కూడా భవిష్యత్తులో బుచ్చిబాబుతో సినిమా చేయడానికి వారు సిద్ధమవుతున్నారట. మరి ఈ గ్యాప్ ను ఏ విధంగా బుచ్చిబాబు వినియోగించుకొని సినిమా చేస్తాడో చూడాలి. ఇప్పటివరకైతే అయన తన తదుపరి సినిమాను ఎన్టీఅర్ తో చేయబోతున్నాడని చెబుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: