మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఈ సినిమా ద్వారా ఇషాన్ సూర్య దర్శకుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉన్నారు. ఇక ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ కూడా నటిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా టైటిల్ వివాదం కారణంగా పలుసార్లు వార్తలలో నిలిచింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ చిత్రీకరణ దశలో ఉండే ఇటీవల విడుదలైన మంచి విష్ణు సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఈ చిత్రం పైన అటు అభిమానులు మంచు విష్ణు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.దర్శకుడు జి నాగేశ్వర్రెడ్డి ఈ సినిమా కథ కోసం కోనా వెంకట్ డైలాగ్స్ అందించారు.



ఈ చిత్రంతో ఎలాగైనా సక్సెస్ సొంతం చేసుకోవాలని చాలా ఆత్రుతతో ఉన్నాడు హీరో మంచు విష్ణు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉన్నారు ఇటీవలే బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో కూడా ఒక స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేయడం జరిగింది అందుకు సంబంధించిన ఫోటోలు గా మారాయి. ఇక అంతే కాకుండా డాన్స్ మాస్టర్ అయిన ప్రభుదేవా తో కూడా ఒక పాటకు డాన్స్ కంపోజ్ చేయడం జరుగుతోంది.ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ల క్యారెక్టర్ ని రిలీఫ్ చేస్తూ తాజాగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఇందులో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావుగా నటిస్తూ ఉన్నారు. సన్నీలియోన్ రేణుక పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నది ఇక పాయల్ రాజ్ కూడా స్వాతి పాత్రలో నటిస్తూ ఉన్నది. ప్రస్తుతం సన్నీలియోన్ కు సంబంధించి ఒక పోస్టర్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగులో పాటు తమిళ్ మలయాళం హిందీ వంటి భాషలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: