తెలుగు బుల్లితెర పై సుదీర్ఘ కాలం నుంచి ప్రేక్షకులు అందరికి కూడా కామెడీ పంచుతు టాప్ రేటింగ్ సంపాదిస్తూ దూసుకుపోతుంది.  జబర్దస్త్ ఒక సాదాసీదా కామెడీ షోగా ప్రారంభమైన జబర్దస్త్ ఇక ఇప్పుడు బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు వచ్చినప్పటికీ అవి జబర్దస్త్ నవ్వుల సునామీ ముందు నిలబడలేకపోయాయ్ అని చెప్పాలి. అయితే జబర్దస్త్ ప్రేక్షకులకు కామెడీ పంచడమే కాదు ఎంతో మంది అప్కమింగ్ కమెడియన్స్ కి  లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. జబర్దస్త్ కారణంగా ఎంతోమంది కమెడియన్ లైఫ్ లో సెటిల్ అయ్యి ఫైనాన్షియల్గా భారీగా ని వెనకేసుకున్నారు...


 ఇకపోతే గత కొంత కాలం నుంచి కూడా జబర్దస్త్ లో అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి.  జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకున్న సార్ కమెడియన్స్ అందరు కూడా షో నుంచి బయటకు వస్తున్నారు. ఇక జబర్దస్త్ మొదలైన నాటి నుంచి తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్న అనసూయ సైతం ఇటీవల జబర్దస్త్ ను వదిలేసింది. ఈ క్రమంలోనే అనసూయ తర్వాత జబర్దస్త్ కొత్త యాంకర్ ఎవరు అన్న చర్చ జరిగింది. కొత్త యాంకర్ గురించి హీరోయిన్ లెవెల్ లో ఎంట్రీ చూపించారు. కానీ తీరా చూస్తే ఎక్స్ ట్రా జబర్దస్త్ చేస్తున్న రష్మీ ని తీసుకొచ్చి జబర్దస్త్ లో కూడా పెట్టేశారు.


 ఇక ఇలాంటి కార్యక్రమంలో అవకాశం వస్తే బాగుండు అని ఎంతో మంది యాంకర్లు కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యాంకర్ మాత్రం జబర్దస్త్ యాంకరింగ్ కోసం అవకాశం వచ్చినప్పటికీ మూడు సార్లు రిజెక్ట్ చేసిందట. ఆమె ఎవరో కాదు శ్రీముఖి. మొదట అనసూయ వెళ్లిపోవడంతో  నిర్వాహకులు శ్రీముఖిని సంప్రదించగా నో చెప్పిందట. తర్వాత రష్మీ యాంకర్ గా సెటిల్ అయిపోయింది. మంచి క్రేజ్ వచ్చిన సమయంలో మరోసారి అడిగితే అప్పుడు కూడా శ్రీముఖి ఒప్పుకోలేదట. ఇటీవలే అనసూయ వెళ్లిపోయిన తర్వాత కూడా శ్రీముఖి జబర్దస్త్ యాంకర్ గా తీసుకురావాలని ప్రయత్నించినా శ్రీముఖి మాత్రం ఒప్పుకోలేదట. కారణం రెమ్యునరేషన్ అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: