రాఘవేంద్రరావు.. ఈ దర్శకుడి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దర్శకేంద్రుడి గా మారిపోయాడు. ఒక సాదాసీదా హీరోయిన్ ని కూడా అతిలోక సుందరిగా చూపించి ప్రేక్షకులను కూడా మైమరిపింప చేయాలి అంటే అది కె.రాఘవేంద్రరావు కే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. హీరోయిన్ లోని అందాలను కొంచెం కొంచెంగా బయటపెడుతూ ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలు తీయడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దిట్ట అని చెప్పాలి.


 ముఖ్యంగా ఈయన సినిమాలలో ఎంతో మంది హీరోయిన్ల అందాలను పూలు పండ్ల తో పోల్చి చూస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలోని సన్నివేశాలను బట్టి ఈ సినిమా తప్పకుండా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కింది అని ప్రేక్షకులు నమ్ముతూ ఉంటారు. ఇక ఎప్పుడూ ఫామిలీ కథా చిత్రాలతో పాటు రొమాంటిక్ సినిమాలను కూడా తెరకెక్కిస్తు ఉంటారు రాఘవేంద్రరావు. కానీ ఆయన కెరీర్లో ఒకే ఒక జానపద చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు ఆ సినిమా ఏదో కాదు సింహ బలుడు.. 1978లో తిరుపతి ప్రొడక్షన్స్లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వాణిశ్రీ హీరోయిన్గా సింహబలుడు అనే సినిమాని తెరకెక్కించారు. ఇక ఇదే సూపర్ స్టార్ కృష్ణ సింహ గర్జన సినిమా కూడా కొమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు సినిమాలు షూటింగ్ జరుగుతున్న సమయంలో అటు ఇండస్ట్రీలో కూడా ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నిర్మాత గిరిబాబు ఒకసారి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి బయట ఉన్న పరిస్థితులను వివరించారట. ఇలాంటి సమయంలోనే ఈ రెండు సినిమాలు కూడా 15 రోజుల గ్యాప్ తో విడుదలయ్యాయి. అయితే ఎన్టీఆర్ జీవితంలో కూడా చిట్టచివరి జానపద చిత్రం కూడా సింహబలుడు సినిమా కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: