‘బింబిసార’ మూవీ సాధించిన ఘనవిజయం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ ఉంటే తనకు మళ్ళీ పునర్జన్మ వచ్చిందని కళ్యాణ్ రామ్ ఓపెన్ గా చెపుతున్నాడు. ఈమూవీ బయ్యర్లకు రూపాయికి రూపాయి లాభం వస్తుందని ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈమూవీ ఫలితంతో కళ్యాణ్ రామ్ కంటే ఎక్కువ నిఖిల్ జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈవారం విడుదల కాబోతున్న ‘కార్తికేయ 2’ మూవీ కూడ ఒక ఫ్యాంటసీ మూవీ శ్రీకృష్ణుడి ఆలయంలో జరిగే మహిమలు గురించి ఆ ఆలయంలో ఉండే రహస్యం గురించి ఈమూవీ కథ ఉంటుంది. దర్శకుడు చందు మొండేటి ఈమూవీని ప్రేక్షకులు సస్పెన్స్ ఫీల్ అయ్యేలా మంచి స్క్రీన్ ప్లే తో ఎక్కడా బోర్ లేకుండా తీసాడు అన్న ప్రచారం జరుగుతోంది.


దాదాపు రెండు నెలల వరస ఫెయిల్యూర్ లకు ‘బింబిసార’ ‘సీతా రామం’ మూవీలు చెక్ పెట్టడంతో ఈవారం విడుదల కాబోతున్న సినిమాలు కూడ చాల ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా నితిన్ '‘మాచర్ల నియోజక వర్గం'’ తో హిట్ కొట్టాలని ఆశ పడుతుంటే నిఖిల్ తన ‘కార్తికేయ 2’ మూవీతో తిరిగి ట్రాక్ లోకి రావాలి అన్న భావంతో ఈ యంగ్ హీరోలు ఇద్దరు తమతమ సినిమాల విజయం పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు పోటీగా అమీర్ ఖాన్ అక్షయ్ కుమార్ లు నటించిన సినిమాలు విడుదల అవుతూ ఉండటంతో మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ బాలీవుడ్ సినిమాల వైపు వెళ్ళే ఆస్కారం ఉంది అంటున్నారు.


వచ్చే సనివారం నుండి సోమవారం వరకు వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో ప్రేక్షకులు ఈసినిమాలు అన్నింటినీ వరసపెట్టి చూస్తారు అన్న భావనలో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. దీనితో ‘బింబిసార’ ‘సీతా రామం’ ఇచ్చిన హిట్ సెంటిమెంట్ ను నిఖిల్ నీతిన్ లలో ఎవరు కొనసాగించి ఇండస్ట్రీకి మరింత ధైర్యాన్ని కలిగిస్తారు అన్న విషయమై ప్రస్తుతానికి సస్పెన్స్..
మరింత సమాచారం తెలుసుకోండి: