సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. మహేష్ బాబు క్లాస్మేట్స్ కూడా స్టార్ హీరోలని బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి. ఇక వారెవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఇకపోతే మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన పేరుని ట్రెండింగ్ చేస్తూ పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే.. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ఇప్పటికీ కూడా అమ్మాయిలా కలల రాకుమారుడుగా రాణిస్తూ అదే అందంతో నాలుగు పదుల వయసులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు మహేష్ బాబు.


ఇక ఇదిలా ఉండగా మహేష్ బాబుకి క్లాస్మేట్స్ అయిన కోలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలు.. వారు  ప్రస్తుతం టాప్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక వారెవరు అనే విషయానికి వస్తే అప్పట్లో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండడం కారణంగా మన తెలుగు హీరోల నివాసాలు కూడా అక్కడే ఉండేవి. అక్కడే వారు పిల్లలకు జన్మనివ్వడం,  వారి విద్యాభ్యాసం కూడా అక్కడే కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ నటీనటుల పిల్లలు,  టాలీవుడ్ నటీనటుల పిల్లలు అంతా ఒకే స్కూల్లో చదువుకునేవారు. ఇక మహేష్ బాబు క్లాస్మేట్స్ కార్తీ, విజయ్..


వీరిద్దరూ కూడా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసింది . ఇక హీరో కార్తీ నటుడు శివకుమార్ చిన్న కుమారుడు కాగా సూర్య ఆయనకు పెద్ద కుమారుడు కావడంతో ఈ ముగ్గురు ఒకే విద్యాసంస్థలు చదువుకోవడం జరిగింది. ఇక అలాగే మహేష్ బాబుతో విజయ్ కి మరొక సంబంధం కూడా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇలా స్టార్ హీరోలు ఒకే క్లాస్మేట్ అని తెలియడంతో అభిమానుల సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: