క్రితంవారం వరకు ధియేటర్లకు జనం రావడం లేదు అంటూ నిర్మాతలు గగ్గోలు పెట్టారు. అయితే ‘బింబిసార’ ‘సీతా రామం’ విడుదల తరువాత మొత్తం సీన్ మారిపోయింది. అప్పటివరకు ఓటీటీ సినిమాలకు అతుక్కుపోయిన ప్రేక్షకుడు ఒక్కసారిగా ధియేటర్ల బాట పట్టడంతో ధియేటర్లు అన్నీ కళకళలాడుతున్నాయి. వీకెండ్ తరువాత కూడ ఈ రెండు సినిమాలకు కలక్షన్స్ బాగుండటంతో ఈ రెండు సినిమాలు మరో వారం వరకు ఈసందడి కొనసాగించే ఆస్కారం ఉంది.


ఈ ఫలితాన్ని అంచానా వేయడంలో ఫెయిల్ అయిన నితిన్ నిఖిల్ ల సినిమాలు ‘మాచర్ల నియోజక వర్గం’ ‘కార్తికేయ 2’ ఈవారం తమ సినిమాల రిలీజ్ డేట్ ను ఖరార్ చేసుకోవడంతో ఈ రెండు సినిమాలకు ప్రస్తుతం సినిమా కష్టాలు వచ్చాయి అన్న ప్రచారం జరుగుతోంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ కావడంతో కొంతవరకు సమస్యలు లేకపోయినప్పటికీ నిఖిల్ ‘కార్తికేయ 2’ మాత్రం ధియేటర్ల కష్టాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.


దీనికితోడు బాలీవుడ్ క్రేజీ మూవీలు ‘లాల్ సింగ్ చద్దా’ ‘రక్షాబందన్’ కూడ ఈవారమే విడుదల అవుతున్న పరిస్థితులలో ఇన్ని సినిమాల మధ్య ధియేటర్లలో సందడి వాతావరణం సందడి వాతావరణం నెలకొని ఉంది. అయితే ఈవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదల అవుతుంటే ఇన్ని సినిమాలు జనం ఎక్కడ చూస్తారు అన్నసందేహాలు కూడ వస్తున్నాయి.


టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నితిన్ నిఖిల్ లు గత కొంతకాలంగా ఫ్లాప్స్ లతో సమతమైపోతున్నారు. అదేవిధంగా బాలీవుడ్ టాప్ హీరోలు అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ ల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది వీరందరికీ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 15 సెలవు కలిసివస్తున్నప్పటికీ ఇన్ని సినిమాలను వరసగా జనం చూస్తారా అన్నదే సందేహం. ఈ నాలుగు సినిమాలలో కనీసం రెండు సినిమాలు సూపర్ హిట్ అయితే చాలు. తిరిగి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి మంచిరోజులు వచ్చాయి అంటూ నిర్మాతలు బయ్యర్లు తెగ పండుగ చేసుకుంటారు అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: