తెలుగు సినిమా ఇండస్ట్రీకి సత్యరాజ్ నటుడుగా బాగా సుపరిచితమే.. ముఖ్యంగా బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రలో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు స్టార్ హీరో అయిన కమల్ హాసన్ తో మళ్లీ పని చేయబోతున్నారు అనే వార్త వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సత్యరాజ్ 35 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ కమలహాసన్ తో కలిసి పనిచేయబోతున్నారు. నిజానికి 1986లో వచ్చిన విక్రమ్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది. అందులో సత్యరాజ్ మెయిన్ విలన్ గా కనిపించారు. ఇక ఒంటి కన్నుతో విచిత్రమైన వేషధారణతో ప్రేక్షకులను విలన్ గా బాగా ఆకట్టుకున్న ఈయన మళ్ళీ ఈ సినిమా తర్వాత కమలహాసన్ తో కలిసి నటించలేదని చెప్పాలి.

2015లో మరుదనాయికం అనే సినిమాలో నటించాల్సి ఉన్నా వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇకపోతే డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఇండియన్ టు సినిమా సెప్టెంబర్ 13వ తేదీ నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ ప్రీతిసింగ్ కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి డైరెక్టర్ శంకర్ కి అలాగే లైకా ప్రొడక్షన్ వారికి మధ్యతల్లెత్తిన అభిప్రాయ భేదాలు కారణంగా ఈ సినిమా షెడ్యూల్ ఆగిపోయింది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే.. ఈ సినిమాలో కీలక పాత్రలో సత్యరాజు నటిస్తున్నట్లు సమాచారం. నెడుముడి వేణు మధ్యలోనే చనిపోవడంతో ఇక ఆయన పాత్రను సత్య రాజ్ తో  భర్తీ చేస్తూ రీ షూట్ చేయబోతున్నారని సమాచారం. ఇకపోతే వివేక్ పాత్రను కూడా కట్ చేసి ఆ పాత్రలో సీనియర్ హీరో కార్తీక్ తో రీప్లేస్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను లైకా ప్రొడక్షన్స్ వారు అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: