మీడియా చాల యాక్టివ్ గా మారిపోయిన పరిస్థితులలో ఎవరు ఏమి మాట్లాడినా ఆ మాటలలోని నెగిటీవిటి గురించి లోతుగా ఆలోచనలు చేస్తున్నారు. దీనితో తలలు పండినవారు కూడ మీడియా ముందు మాట్లాడటానికి జంకుతున్నారు. ఈవారం విడుదలకాబోతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ మూవీని ప్రమోట్ చేస్తూ నితిన్ నిర్వహించిన మీడియా సమావేశంలో కూడ ఇదే పరిస్థితి నితిన్ లో కనిపించిందా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.కొన్నిరోజుల క్రితం ఈమూవీ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గతంలో మాట్లాడినట్లుగా చెప్పిన కొన్ని కామెంట్స్ ను వైరల్ చేస్తూ కొందరు అతడి పై నెగిటివ్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీనితో ఎలర్ట్ అయిన ఈమూవీ యూనిట్ వర్గాలు ఈ నెగిటివ్ కామెంట్స్ ను ఖండించడమే కాకుండా దీనిపై ఫిర్యాదులు కూడ ఇచ్చారు. ఈవార్త కొద్దిరోజుల క్రితం సంచలనంగా మారింది.ఇప్పుడు ఈవిషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని కాబోలు నితిన్ ఈమూవీ ప్రమోషన్ కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో చాల ఆచితూచి మాట్లాడాడు. ఈ మీడియా సమావేశంలో ఎటువంటి హడావిడి చేయకుండా అతి తక్కువగా మాట్లాడి ఆ సమావేశాన్ని నితిన్ ముగించడం మీడియా వర్గాలను ఆశ్చర్య పరిచింది. అంతేకాదు ఈమీడియా సమావేసానికి అతి తక్కువగా మీడియా సంస్థలను పిలిచి చాల మీడియా సంస్థలను పిలవకపోవడంతో నితిన్ మీడియాను చూసి భయపడుతున్నాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు.నితిన్ ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోగానే కొనసాగుతున్నాడు. నితిన్ కు ఒక్క హిట్ వస్తే మరొక హిట్ రావడానికి చాల కాలం పడుతోంది. ఈమధ్య మళ్ళీ నితిన్ కు ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ‘మాచర్ల నియోజక వర్గం’ హిట్ అవ్వడం చాల అవసరం. అయితే ఈసారి నితిన్ కు బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో నిఖిల్ నుండి కూడ గట్టిపోటీ ఎదురు అవుతోంది. ఇలాంటి పరిస్థితులలో నిఖిల్ కెరియర్ ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: