బుల్లి తెర పై సరికొత్త కామెడీతో సంచలనమే సృష్టించింది జబర్దస్త్ కార్యక్రమం. అన్ని షో ల లాగానే  ఒక సాదా సీదా కామెడీ షో గా ప్రారంభమైంది. కానీ ఊహించని రీతిలో పాపులారిటీ  సొంతం చేసుకుంది. సినిమాల్లో ఉండే మూస కామెడీ కాదు అసలు సిసలైన కామెడీ అంటే ఏంటో జబర్దస్త్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులందరికీ రుచి చూపించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక్క ఎపిసోడ్  కూడా మిస్ అవ్వకుండా  జబర్దస్త్ చూడటం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఒత్తిడితో కూడిన లైఫ్ లో  జబర్దస్త్ చూసి కాసేపు నవ్వుకుని ఉపశమనం పొందవచ్చు అని  ఎంతో మంది భావిస్తున్నారు చెప్పాలి.


 జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కమెడియన్స్ చాలామంది ఉన్నారు.  కాగా ఇలాంటివి వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. అందరిలాగానే ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ప్రతి స్కిట్ లో ఒక స్పెషల్ గెటప్ తో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకునే వాడు  శ్రీను. గెటప్లో ఒదిగిపోయి నటించడం వల్ల గెటప్ శ్రీను గా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ జబర్దస్త్ కార్యక్రమంలో గెటప్పులు వేయడం అంటే ఎవరైనా గెటప్ శ్రీను తర్వాతే అని చెప్పాలి. ఇక అలాంటి గెటప్ శ్రీను ఇటీవలే జబర్దస్త్ లో నడుస్తున్న లవ్ ట్రాక్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా ఆటో రాంప్రసాద్ స్కిట్ లో జబర్దస్త్ లో లవ్ ట్రాక్  నడుపుతున్న వర్ష -ఇమాన్యుల్, ప్రవీణ్- పైమా లను స్టేజి మీదికి పిలుస్తారు. ఈ క్రమంలోనే వారిని ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఇక అటు రొమాంటిక్ లవ్ సాంగ్స్ ప్లే చేయడం చేస్తూ ఉంటారూ. దీంతో గెటప్ శ్రీను డీజే అతని దగ్గరికి వెళ్లి ఇలాంటి లవ్ సాంగ్ ఎవరు వేయామన్నారు.. ఇలాంటి లవ్ సాంగ్స్ వేసి వారి మధ్య ఏమీ లేక పోయినప్పటికీ ప్రేమ పుట్టిస్తున్నారు అంటూ కౌంటర్ వేస్తాడు  గెటప్ శ్రీను. ఇక దీన్ని బట్టి జబర్దస్త్ లో లవ్ ట్రాక్ లు తెర మీదికి రావడానికి కారణం ఏంటో తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: