టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత ప్రస్తుతం వేగంగా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాదు  సమంతకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు.ఇకపోతే పలు సర్వేలలో సైతం సమంత నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే సమంత నటించి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన కణ్మణి రాంబో ఖతీజా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.కాగా అటు సమంత ఇటు నయనతార తెలుగులో ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోవడం, ఆచార్య సినిమా రిలీజైన సమయంలో ఈ సినిమా రిలీజ్ కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. 

అయితే ఇక  మూడు నెలల్లో సమంత నటించిన మూడు పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయని సమాచారం.ఇకపోతే  ఒక విధంగా ఇది రేర్ రికార్డ్ అని సమంత అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇదిలావుంటే ఇక సమంత ఇప్పటికే శాకుంతలం, యశోద సినిమాల షూటింగ్ లను పూర్తి చేసింది.  పోతే విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ఖుషీ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఇక లైగర్ పాజిటివ్ ఫలితాన్ని సొంతం చేసుకుంటే ఖుషీ సినిమా బాలీవుడ్ లో కూడా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

పోతే అక్టోబర్ నెలలో యశోద సినిమా రిలీజ్ కానుందని నవంబర్ నెలలో శాకుంతలం రిలీజ్ కానుందని డిసెంబర్ నెలలో ఖుషీ మూవీ విడుదల కానుందని బోగట్టా. ఇక ఈ మూడు సినిమాలు థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధిస్తే సమంత రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.  అయితే సమంత ఒక్కో సినిమాకు మూడు కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. పోతే  సమంత తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఇక  సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: