తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నాచితక పాత్రలు చేస్తూ పెద్దగా గుర్తింపు సంపాదించుకోని రష్మి గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా ప్రత్యక్షం అయిన తర్వాత మాత్రం  ఊహించని రీతిలో పాపులారిటీ సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితురాలిగా మారిపోయింది.అందం అభినయంతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది అని చెప్పాలి. వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించిన తర్వాత ఈ అమ్మడికి వెండితెరపైనే అవకాశాలు కూడా తలుపు తట్టాయ్.


 ఈక్రమంలోనే రష్మి గౌతమ్ నటించిన గుంటూరు టాకీస్ సినిమా అయితే ప్రేక్షకులు ఎప్పుడూ మరిచిపోలేరు. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చేసిన అందాల ఆరబోత ఇప్పటికి కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన రష్మీ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. అయితే గుంటూరు టాకీస్ సినిమా లో హీరో తో లిప్ లాక్ సన్నివేశాలు విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చాయి అయితే ఈ లిప్ లాక్ సన్నివేశాలు గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రష్మి గౌతమ్ కి ముందుగా చెప్పలేదట.


 చెప్పకుండానే ఇక లిప్ లాక్ సన్నివేశాలను చిత్రీకరించారు అంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన రష్మి గౌతమ్ క్లారిటీ ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదు అంటూ చెప్పుకొచ్చింది. ముందుగా సన్నివేశాన్ని వివరించిన తర్వాత షూటింగ్ జరిగింది అంటూ తెలిపింది. అయితే ఆ పాత్రకి లిప్ లాక్ సన్నివేశం అవసరం కాబట్టి చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది రష్మి.  అయితే అందాల ఆరబోత ద్వారా మరిన్ని అవకాశాలు అందుకోవాలని భావించిన రష్మికి  నిరాశే ఎదురైంది. ఇక అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గానే సరిపెట్టుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి: