మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న లెజెండ్రీ యాక్టర్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దుల్కర్ సల్మాన్. ఇక తండ్రి బ్యాక్ గ్రౌండ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కి అటు అమ్మాయిలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ ఎన్నో మలయాళ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు దుల్కర్ సల్మాన్. ముఖ్యంగా మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి దుల్కర్ సల్మాన్ తన నటనతో మెప్పించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల నేరుగా తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


 సీతారామం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించగా.. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే సూపర్ స్టార్ కొడుకు అయినప్పటికీ ఒక సాధారణ కుర్రాడు లాగానే ఎప్పుడూ అందరితో మెదులుతూ ఉంటాడు దుల్కర్ సల్మాన్. అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకి 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట దుల్కర్ సల్మాన్. ఇదే ఈ సమయంలో దుల్కర్ సల్మాన్ ఆస్తుల గురించి కొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నివసిస్తున్న ఇల్లు ఖరీదు దాదాపు 100 కోట్ల వరకు ఉంటుందట.


 ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. అంతేకాదు ఆయన దగ్గర సుమారు 20 కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. అయితే దుల్కర్ సల్మాన్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.. ఇక ఒక్కో బ్రాండ్ కి ప్రమోషన్ చేసినందుకుగాను కోటి రూపాయల పారితోషికం తీసుకుంటాడట దుల్కర్ సల్మాన్.  ఇక ప్రస్తుతం సినిమాలతో వాణిజ్య ప్రకటనలతో బిజీ బిజీగా గడుపుతున్న దుల్కర్ సల్మాన్ ఆస్తుల విలువ 400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: