బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య అక్కినేని కూడా ఓ కీలకపాత్ర పోషించాడు.అందుకే.. ఈ చిత్రాన్ని నాగార్జున ఇంకా చిరంజీవి ప్రత్యేకంగా తెలుగులో ప్రమోట్ చేశారు. తెలుగులో చిరంజీవి సమర్పణలో విడుదలయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం..!!


ఇక కథ విషయానికి వస్తే..పుట్టుకతోనే స్పెషల్ కిడ్ లాల్ సింగ్ చడ్డా (అమీర్ ఖాన్). అయితే.. తన అంగవైకల్యాన్ని అతను జయించి తల్లి దీవెనలతో మిలటరీలో జాయినవుతాడు. అనంతరం తన చిన్నప్పటి ప్రేయసి అయిన రూప (కరీనా కపూర్)ను పెళ్లాడడం కోసం ఆర్మీ నుండి వెనక్కి వస్తాడు. ఇక అదే సమయంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బాలరాజు (నాగచైతన్య) కుటుంబానికి కూడా అండగా నిలుస్తాడు.ఇక ఈ ప్రయాణంలో లాల్ సింగ్ నేర్చుకున్న జీవిత సత్యాలు ఇంకా అలాగే అతడ్ని వెంబడించిన అంశాల కలయికే 'లాల్ సింగ్ చడ్డా' కథాంశం.


నటన విషయంలో హీరో అమీర్ ఖాన్ పర్ఫెక్షనిస్ట్ అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ చిత్రంలో ఆయన పోషించిన భిన్న షేడ్స్ ఇంకా అమీర్ ఖాన్ మునుపటి చిత్రాలు 'పీకే, ధూమ్ 3' చిత్రాల్లోని అతడ్ని నటనను గుర్తుచేయడం గమనార్హం. ఇప్పటివరకూ కూడా ప్రతి చిత్రానికి విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ ఇంకా నటనతో ఆకట్టుకునే అమీర్ ఖాన్ ఈ చిత్రానికి మాత్రం ఎందుకో పెద్దగా వైవిధ్యం చూపలేదనే చెప్పాలి.ఇక రూప పాత్రలో కరీనా కపూర్ ఒదిగిపోయింది. అయితే.. ఆమె పాత్ర మాత్రం పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది.


ఇకపోతే.. బాలరాజుగా మన నాగచైతన్య మాత్రం అదరగొట్టేశాడు. చైతన్య నటుడిగా ఎదుగుతున్నాడు అనేందుకు ఈ బాలరాజు పాత్ర మరో చక్కటి ఉదాహరణ. పైగా అన్నీ భాషల్లో తానే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా మరో ప్లస్ పాయింట్. తల్లి పాత్రలో మోనా సింగ్ కూడా చక్కని అభినయంతో ఆకట్టుకుంది.ఐతే బాలీవుడ్ ఫెయిల్యూర్ స్ట్రీక్ ను 'లాల్ సింగ్ చడ్డా' బ్రేక్ చేస్తుంది అనే అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయి. 'ఫారెస్ట్ గంప్' చూడని ఇంకా అమీర్ ఖాన్ సినిమాల మీద ఎక్కువ అంచనా వేయని ప్రేక్షకులను మాత్రమే ఈ చిత్రం కాస్తో కూస్తో ఆకట్టుకుంటుంది.అయితే ఏ అంచనాలు లేకుండా వెళ్లి చూస్తే సినిమా నచ్చుతుంది. ఒకటి మాత్రం నిజం ఈ సినిమాలో చైతూ అయితే తన పాత్రకి ప్రాణం పోశాడు. చాలా బాగా ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: