హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా కొత్తదనంతో కూడిన టాలీవుడ్ లో కథాంశాలను ఎంచుకుంటూ హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు సుధీర్‌బాబు.గతంలో రొటీన్ సినిమాలను చేసుకుంటూ వచ్చిన సుధీర్ బాబు 'సమ్మోహనం' సినిమాతో తన రూట్ ని మార్చుకున్నాడు. ఈ చిత్రంలో సుధీర్ నటన ప్రేక్షకులను ఎంతగానో ఫిదా చేసింది. ఈ చిత్రం తర్వాత సుధీర్ కథల ఎంపిక కూడా పూర్తిగా మారింది. 'వి', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి వినూత్న కథలను సుధీర్ ఎంచుకుంటున్నాడు. కమర్షియల్‌గా ఈ రెండు చిత్రాలు అంతగా సక్సెస్ కాకపోయినా సుధీర్‌కు మాత్రం మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఈయన మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే ఓ లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను చాలా విపరీతంగా ఆకట్టుకుంది. మేకర్స్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.ఈ చిత్రం సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కానున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.


ఇక ఈ పోస్టర్‌లో కృతిశెట్టి పరిగెడుత్తుతుంది. కృతితో పాటే సుధీర్ బాబు కూడా మైక్ పట్టుకుని పరిగెడుతున్నాడు. పోస్టర్‌ను కనుక చూస్తుంటే ఈ సినిమాలో సుధీర్‌బాబు ఓ సీన్‌ను దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌లు గమనిస్తే ఈ మూవీలో సుధీర్ దర్శకుడిగా నటించినట్లు కన్ఫార్మ్ అయింది. ఇక ఈ చిత్రం సుధీర్‌బాబు ఇంకా మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. గతంలో వీళ్ల కాంబోలో వచ్చిన 'సమ్మోహనం', 'వి' చిత్రాలు కూడా ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.అలాగే రాహుల్ రామకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నాడు. బెంచ్‌మార్క్ స్టూడీయోస్‌ ఇంకా మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: