నటుడిగా , నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో సంయుక్త మీనన్ , క్యాథరీన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై నందమూరి అభిమానులతో పాటు మాములు సినీ ప్రముఖులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ కి మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 7.83 కోట్లు , సీడెడ్ : 4.84 కోట్లు , యూ ఏ : 3.16 కోట్లు , ఈస్ట్ : 1.38 కోట్లు , వెస్ట్ : 1.00 కోట్లు , గుంటూర్: 1.63 కోట్లు , కృష్ణ : 1.18 కోట్లు , నెల్లూర్ : 67 లక్షలు . ఆరు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బింబిసార మూవీ  21.69 కోట్ల షేర్ , 34.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లము వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.40 కోట్లు . ఓవర్ సీస్ లో : 1.75 కోట్లు . ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ  24.84 కోట్ల షేర్ , 41.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: