నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK -107 ఈ సినిమా టైటిల్ ఇంకా వర్కింగ్ దశలో ఉన్నది అయినా కూడా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటూ ఉన్నది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ సినిమాలో బాలయ్య చాలా మాస్ గా నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో మరొకసారి బాలయ్య రెచ్చిపోయి నటిస్తూ ఉన్నాడటంలో ఎలాంటి సందేహం లేదు దీంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాయో అంటు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


తాజాగా బాలకృష్ణ తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది యంగ్  డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య తన 108వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు తాజాగా రాఖీ పౌర్ణమి కానుకగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా చిత్ర బృందం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మరొకసారిథమన్ తన పవర్ ని చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ 108వ చిత్రానికి కూడా సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నాడు. బాలకృష్ణ , థమన్ కాంబినేషన్ అంటే అభిమానులు కూడా చాలా పండగ చేసుకుంటూ ఉన్నారు.


ఇక తాజాగా అప్డేట్ తో  నందమూరి అభిమానులకు మరింత సంతోషాన్ని చేకూర్చడం జరిగింది. ఇక బాలకృష్ణ ఇదివరకు ఏ సినిమాలో చూడని  గెటప్ లో ఈ సినిమా లో  కనిపించబోతున్నారని డైరెక్టర్ అనిల్ రాఘవపూడి తెలియజేశారు బాలకృష్ణ కూతురు పాత్రలో యువ హీరోయిన్స్ శ్రీ లీలా నటిస్తున్నది. ఈ సినిమా పైన అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ని పెట్టబోతున్నారు అనే విషయంపై మరింత అద్భుతంగా ఉన్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: