‘కార్తికేయ’ మూవీ విడుదలై 8సంవత్సరాలు దాటిపోతోంది. అయితే ఆమూవీ చిన్న సినిమాలలో మంచి సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ఖ్యాతి ఉంది. ఆసినిమా హిట్ అయిన తరువాత నిఖిల్ మార్కెట్ చాల బాగా పెరిగింది. అయితే ఆతరువాత వచ్చిన నిఖిల్ నటించిన సినిమాలు అన్నీ వరసగా ఫెయిల్ అవ్వడంతో నిఖిల్ మార్కెట్ బాగా దెబ్బతింది.


ఇలాంటి పరిస్థితులలో తనకు గతంలో హిట్ ఇచ్చిన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ ను నిఖిల్ బాగా నమ్ముకున్నాడు. వాస్తవానికి ఈమూవీ సమ్మర్ రేస్ లోనే విడుదల కావలసి ఉంది. అయితే సమ్మర్ లో భారీ సినిమాల హడావిడి బాగా ఉండటంతో ఈమూవీని జూలై కి మార్చారు. అయితే అక్కడ కూడ విడుదలకు పరిస్థితులు అడ్డు తగలడంతో ఎట్టకేలకు ఈమూవీని ఈవారం విడుదల చేస్తున్నారు.


ఈసినిమాకు పోటీగా నితిన్ సినిమాతో పాటు బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు కూడ ఉండటంతో ఈమూవీకి ధియేటర్లు దొరకడమే కష్టం అయింది అన్న మాటలు వినిపించాయి. అయితే ఈవిషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిఖిల్ పోటీలోకి దిగుతున్నాడు. దీనికి తగ్గట్టుగానే ఈమూవీని కూడ బాగా ప్రమోట్ చేసాడు. అయితే ఈమూవీ రిజల్ట్ ఇంకా తెలియకుండానే నిఖిల్ నోటివెంట ‘కార్తికేయ 3’ మాటలు రావడం ఆశ్చర్యంగా మారింది.


తన సినిమా ఘనవిజయం సాధించి ‘కార్తికేయ 3’ కి పునాది వేస్తుందని నిఖిల్ అనడం షాకింగ్ గా మారింది. ‘కార్తికేయ’ మూవీ కథ తెలుగు రాష్ట్రాలలోని సుబ్రహ్మణ్యపురం అన్న ప్రాంతంలో జరిగితే ఈ సీక్వెల్ ఉత్తరాదిలోని ద్వారక ప్రాంతంలో జరుగుతుందని చెపుతూ ఈమూవీకి కొనసాగింపుగా ఖచ్చితంగా ‘కార్తికేయ 3’ తీస్తానని నిఖిల్ చెపుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కథ గురించి ఆలోచన చేస్తున్నాడని దీనికి సంబంధించిన కథ తొందరలోనే ఫైనల్ అవుతుంది అంటున్నాడు. అయితే ‘కార్తికేయ 3’ హీరో ఇంట‌ర్నేష‌న‌ల్ లెవెల్లో మిస్ట‌రీ ఛేదించే ఆప‌రేష‌న్ చేస్తాడని నిఖిల్ చెపుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: