టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ అనే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ లో హీరోగా నటించిన విషయం మాన్స్ అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై ఈ మూవీ ని పూరి జగన్నాథ్ మరియు కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ లో రమ్య కృష్ణ , విజయ్ దేవరకొండ తల్లి గా నటించగా , మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. 

మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేది దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్  విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం మరో క్రేజీ అప్ డేట్ ను విడుదల చేసింది. తాజాగా లైగర్ చిత్ర బృందం ఈ సినిమా నుండి 'కాకా 2.0' అనే సాంగ్ ను ఈ రోజు అనగా ఆగస్ట్ 12 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. విజయ్ దేవరకొండ ఆఖరుగా వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే లైగర్ మూవీ తో విజయ్ దేవరకొండ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: