ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల్లు అర్జున్ ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు . అల్లు అర్జున్ కొంత కాలం క్రితమే సుకుమార్ దర్శకత్వం లో రష్మీక మందన హీరోయిన్ గా తెరకెక్కిన పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించింది . అలాగే పుష్ప మూవీ లోని అల్లు అర్జున్ నటన కు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి .

మరి కొన్ని రోజు ల్లోనే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది . పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై దేశ వ్యాప్తం గా సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . ఇలా మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను ఇండియా వ్యాప్తం గా సంపాదిం చుకున్న అల్లు అర్జున్ తాజాగా ఒక భారీ ఆఫర్ ని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది . తాజాగా అల్లు అర్జున్ కు ఒక ప్రముఖ విస్కీ బ్రాండ్  కి ఆడ్ చేయడానికి కి పది కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినట్లు , అల్లు అర్జున్ మాత్రం ఆ పది కోట్ల ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది . ఇలా విస్కీ బ్రాండ్ కు సంబంధించిన క్రేజీ ఆఫర్ ను అల్లు అర్జున్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: