టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా  , అనన్య పాండేమూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలక పాత్ర లో నటించగా ,  రమ్య కృష్ణ , విజయ్ దేవరకొండ కు తల్లిగా ఈ సినిమాలో నటించింది . ఈ మూవీ ని ఆగస్ట్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు . 

మూవీ విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ సభ్యులు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు . ఇందులో భాగంగా తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .  తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... మొదట్లో ఏదైనా విషయం గురించి ప్రశ్నిస్తే చాలా ఎక్కువగా మాట్లాడే వాడిని ,  కాక పోతే ప్రస్తుతం అది అనవసరం అనిపిస్తుంది . అలాంటి ప్రశ్నల విషయంలో కొంత మంది ముందు గానే నాపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నారు . నేను చెప్పే విషయాలు వారి ఆలోచన లో మార్చవు . అందుకే కొన్ని సమయాల్లో నోరు విప్పక పోవడం మంచిది అని నేను నమ్ముతున్నాను అని విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో చెప్పు కొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: