నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . అఖండ లాంటి అద్భుతమైన విజయం తర్వాత బాలకృష్ణ , గోపిచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తుండగా , వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించ బోతుంది . ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్టు సమాచారం . ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ లభించింది .  

ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకు లలో ఒకరైన అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో హీరోగా నటించ బోతున్నాడు . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది . ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరైన బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న ట్లు తెలుస్తోంది . ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహ , లెజెండ్ , అఖండ  మూవీ లు కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. ఇలా నందమూరి నట సింహం బాలకృష్ణ తన తదుపరి సినిమాలకు అదిరిపోయే లైనప్ ని చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: