బాక్సింగ్ దిగ్గజ మైక్ టైసన్ లైగర్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించడం జరిగింది. ఇక మైక్ టైసన్ ఎంట్రీ తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోబోతోంది అని చెప్పవచ్చు దీంతో ఈ సినిమా హైప్ కూడా మరింత పెరిగిపోయింది ఇప్పటికే ఈ పాత్రలకు సంబంధించి గ్లింప్స్ కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ సినిమాలో మైక్ టైసన్ కు నెగటివ్ పాత్ర లేదా పాజిటివ్ పాత్ర కనిపిస్తుందా అనే ఒకటే బజ్ క్రియేట్ అవుతుంది మెజారిటీ వర్గం టైసన్ కి నెగిటివ్ రోల్ లోనే బాగా కనిపిస్తారని అంచనా వేస్తున్నారు.


ఇక పూరి జగన్నాథ్ మైక్ టైసన్ ని ఆ రకంగా చూపించడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా సమాచారం వీటన్నిటిని తెరదించడానికి మరి కొద్ది రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే అసలు లైగర్ సినిమాలోకి మైక్ టైసన్ తీసుకురావడం అన్నది ఎవరి ఆలోచన అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. పూరి నిర్మాణ భాగస్వాములో చార్మి కూడా భాగం ఉండడంతో ఆమె ఐడియాన లేకపోతే పూరి జగన్నాథ్ ఐడియాను అన్నట్లుగా అభిమానులు ఆలోచిస్తున్నారు అయితే మైక్ టైసన్ కోసం చిత్ర యూనిట్ మాత్రం చాలా శ్రమించాల్సి వచ్చింది అన్నట్లుగా సమాచారం.


టైసన్ని ఒప్పించి తీసుకువచ్చే బాధ్యతలు మాత్రం కేవలం చార్మినే తీసుకున్నదట మైక్ టైసన్ అమెరికాలో న్యూయార్క్ బ్లాక్ సిటీలో ఉంటారట. రిటైర్మెంట్ తర్వాత అక్కడే స్థిర పడిపోయారు. టైసన్ని లైగర్ సినిమాలో నటించమనేందుకు స్వయంగా చార్మినే ఆయనను కలిసిందట ఆయన పాత్ర గురించి వివరించగా ఆ సమయంలో టైసన్ ను ఒప్పించడానికి చాలా కష్టపడిందట చార్మి.ఇక ముంబైకి వచ్చి షూటింగ్ చేయడం అమెరికాలో షూటింగ్ కి సహకరించకపోవడం ఇలా వీటి వెనక చార్మినే కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇక కేవలం చార్మి కోసమే ఆయన ఈ సినిమాలో నటించారు అన్నట్లుగా సమాచారం. ఇక అంతే కాకుండా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు కావాల్సిన బాధ్యతలన్ని చార్మినే తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: