బాలీవుడ్ స్టార్ హీరోస్ ఆమిర్ఖాన్ 'లాల్సింగ్ చడ్డా', అక్షయ్కుమార్ 'రక్షాబంధన్'.. సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో తొలి రోజు చాలా దారుణాతి దారుణంగా బోల్తా కొట్టాయి.అసలు అత్యంత దారుణమైన ఓపెనింగ్స్ను అందుకున్నాయి.ఇక భారతీయ చిత్ర పరిశ్రమలో ఆమిర్ఖాన్ రేంజ్ గురించి అసలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'దంగల్‌' సినిమాతో ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ గ్రాసింగ్‌ మూవీని అందించిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌.. ఆ తరువాత "థగ్స్ ఆఫ్ హిందూస్తానన్" సినిమాతో అట్టర్ ప్లాప్ ఇచ్చాడు. ఇక నాలుగేళ్ల తర్వాత "లాల్సింగ్ చడ్డా" తో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిశారు. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం చాలా దారుణంగా విఫలమైంది. ఆమిర్‌ ఖాన్ రేంజ్‌కు ఏమాత్రం తగని ఓపెనింగ్స్ ఇవి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ.10.75 కోట్లు మాత్రమే అందుకుంది. గత 13 ఏళ్లలో ఆమిర్ కెరీర్లో అసలు ఇదే అత్యంత తక్కువ ఓపెనింగ్స్.


ఆయన కెరీర్లో డిజాస్టర్గా నిలిచిన ధగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా అయితే అసలు తొలిరోజే రూ.52కోట్లు అందుకోవడం గమనార్హం.అసలే కొన్నాళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న బాలీవుడ్‌ ఇండస్ట్రీ.. లాల్‌ సింగ్‌ చడ్డా సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నా.. తొలి రోజు మాత్రం ఫ్యాన్స్‌ను చాలా తీవ్రంగా నిరాశపరిచింది. అయితే రానున్నది లాంగ్‌ వీకెండ్‌ కావడం వల్ల వసూళ్లు పెరుగుతాయన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రంతో పాటు రిలీజైన మరో స్టార్ హీరో సినిమా అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధన్‌ కూడా నిరాశపరిచింది. తొలి రోజు రూ.8-805 కోట్లు వసూలు చేసిందని సమాచారం తెలిసింది. ఇక ఈ సినిమాకు కూడా పూర్తిగా నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి.ఈ వసూళ్ళని బట్టి చూస్తుంటే బాలీవుడ్ పతనం అయిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది. మరి బాలీవుడ్ ని ఏ సినిమా కాపాడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: