పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ తన అభిమానులకు మంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణ ఇప్పుడు ఫలిస్తుంది.క్రేజీ అప్‌డేట్‌తో రాబోతున్నారు మన డార్లింగ్. ఇక ఆయన నటిస్తున్న `సలార్‌` సినిమా నుంచి ఆప్‌ డేట్‌ ఇవ్వబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. మరో రెండు రోజుల్లో ఈ అప్‌డేట్‌ అనేది రానుందని తెలిపింది. దీంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది. మరి ఇంతకి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ రాబోతుందనే ఇప్పుడు చాలా పెద్ద సస్పెన్స్.`సలార్‌` సినిమా నుంచి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్‌లు తప్ప మరే అప్‌డేట్‌ రాలేదు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు షూటింగ్‌ లొకేషన్‌ పిక్స్ కూడా లీక్‌ అయ్యాయి.ప్రభాస్‌ మాస్‌ లుక్‌కి ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్‌డేట్ల కోసం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు. అయినా కూడా స్పందించలేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు రియాక్ట్ కాబోతున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా `సలార్‌`సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అప్‌డేట్‌ని ప్లాన్‌ చేసినట్టు సమాచారం తెలుస్తుంది.మరి ఏం అప్‌డేట్‌ ఇస్తారనే చర్చ సోషల్‌ మీడియాలో బాగా ఊపందుకుంది.ఈ సినిమాని రెండు భాగాలుగా చేయబోతున్నారని, రిలీజ్‌ డేట్‌లు ప్రకటించే అవకాశం ఉందన్నారు.


అలాగే మరోవైపు ఫస్ట్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఇవ్వబోతున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఊహగానాలు ఎలా ఉన్నా ఇప్పుడు `సలార్‌`సినిమా మాత్రం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. కేవలం రెండు రోజుల్లో అప్‌డేట్‌ అనే దానితోనే ఊహించని క్రేజ్‌ ఇంకా హైప్‌ వస్తుండటం విశేషం.ఇక మైనింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా హీరోయిన్ శృతి హాసన్‌ నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర నెగటివ్‌గా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. `కేజీఎఫ్‌ `తో సంచలనాలు క్రియేట్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో భారీ అంచనాలున్నాయి. `కేజీఎఫ్‌` సినిమాని మించి ఉండబోతుందనే టాక్‌ మొదలైంది. ఇక హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్‌ చేయబోతున్నట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: