టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా సీతా రామం అనే ప్రేమ కథ చిత్రం తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ ఆగస్ట్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో దగ్గర విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర సాధించడంతో ప్రస్తుతం ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇప్పటి వరకు సీతా రామం మూవీ వారం రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. వారం రోజులకు గాను సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం.

నైజాం : 4.28 కోట్లు , సీడెడ్ : 1.23 కోట్లు , యూ ఏ : 1.67 కోట్లు , ఈస్ట్ : 1.01 కోట్లు , వెస్ట్ : 66 లక్షలు , గుంటూర్ : 77 లక్షలు , కృష్ణ : 89 లక్షలు , నెల్లూర్ : 42 లక్షలు , వారం రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 10.93 కోట్ల షేర్ , 20.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో  : 1.15 కోట్లు .  ఇతర భాషలలో : 3.00 కోట్లు . ఓవర్ సీస్ లో : 4.10 కోట్లు .
ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో సీతా రామం మూవీ 19.18 కోట్ల షేర్ , 37.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: