నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీ కి మూవీ యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు.

ఇలా ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ఎన్ బి కే 107 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా రోజులు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , వరలక్ష్మి శరత్ కుమార్మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది.

మూవీ లో దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ కి మూవీ యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయని విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ మూవీ కోసం 2 క్రేజీ టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ కోసం చిత్ర బృందం రెడ్డి గారు , జై బాలయ్య అనే రెండు క్రేజీ టైటిల్ లను పరిశీలిస్తున్నట్లు , ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: