ఈ రోజు నుండి కొన్ని  మూవీ లు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి  ఎంట్రీ ఇచ్చాయి. ఈ రోజు నుండి 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన  సినిమాలు ఏవో తెలుసుకుందాం.

సాయి పల్లవి తాజాగా గార్గి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 15 జూలై 2022 వ తేదీన థియేటర్ లలో విడుదల  అయ్యింది. ఈ మూవీ కి థియేటర్ లలో ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా థియేటర్ లలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకున్న గార్గి మూవీ ఈ రోజు నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన సోనీ లివ్  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  తమిళ్ , తెలుగు మరియు కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.  


కాడవేర్ మూవీ ప్రముఖ  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో తెరకెక్కిన మహా మనిషి మూవీ ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన ఆహా  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  తెలుగు భాషలో ఈ రోజు నుండి స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం స్టార్ హీరోల్లో ఒకరు అయిన ఫహాద్ ఫాజిల్ నటించిన మాలిక్ మూవీ ఈరోజు నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయిన ఆహా  'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో  తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: