టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన నిఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నిఖిల్ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన కార్తికేయ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న విషయం మనకు తెలిసిందే. కార్తికేయ మూవీ లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించగా చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

కార్తికేయ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ గా నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి కార్తికేయ 2 మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ రేపు అనగా ఆగస్ట్ 13 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. కార్తికేయ 2 మూవీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కడం , అలాగే ఇప్పటికే కార్తికేయ 2 మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా సినీ ప్రేమికులు కార్తికేయ 2 మూవీ పై మంచి అంచనాలు పెట్టుకోవడం వల్ల ఈ మూవీ కి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ఏరియాల్లో నుండి కూడా కార్తికేయ 2 మూవీ కి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ లకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మరి కార్తికేయ 2 మూవీ ఏ రేంజ్ విజయం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: