అందం అభినయానికి కేరాఫ్ అడ్రస్ సౌందర్య.. అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది ఎవరైనా ఉన్నారు అంటే  అది సౌందర్యం మాత్రమే అని చెబుతూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. హీరోయిన్ అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే చేయాలని ట్రెండ్ కొనసాగుతున్న సమయంలో అందాల ఆరబోత చేయకుండానే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది సౌందర్య. సాంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ గా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది.


 కన్నడనటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా ఎంతో మంది తెలుగు అభిమానులకు సొంతం చేసుకుంది అని చెప్పాలి. దాదాపు 12 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో అగ్రతారగా వెలుగొందింది. 120కి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోలందరితో జోడి కట్టింది. అయితే ఇలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఒక విమాన ప్రమాదంలో సౌందర్య చనిపోయింది. దీంతో అభిమానులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. స్టార్ హీరోయిన్ గా ఉన్న సౌందర్య క్రేజ్ బిజెపి క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించింది అనే విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు సౌందర్య. ఇక 2004లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిహెచ్ విద్యాసాగర్ రావు మద్దతుగా ప్రచారం నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇందు కోసం సౌందర్య తన అన్నయ్య అమర్ నాథ్ తన ఫ్రెండు రమేష్ తో కలిసి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కరీంనగర్ బయలుదేరారు. ఇలా బయలుదేరిన తర్వాత కాసేపటికే హెలిక్యాప్టర్ సాంకేతిక కారణాలవల్ల కూలిపోయింది. అయితే ప్రమాదానికి ముందు.. ప్రచారంలో మంచి స్పీచ్ ఇవ్వాలని మాట్లాడారట సౌందర్య.. అంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో  ఎలాగైనా హెలికాప్టర్ను బాగు చేయాలని సౌందర్య పైలెట్ ను అడిగిందట. బాగు చేయడం కుదరదు అని చెప్పడంతో కాపాడండి అంటూ బిగ్గరగా అరిచిందట.. అయితే సిబ్బంది కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ చివరికి ఎగసి పడుతున్న మంటలకు నిమిషాల వ్యవధిలోనే అందులో ఉన్న వారందరూ మాంసం ముద్దలుగా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: