పలాస 1978 , శ్రీదేవి సోడా సెంటర్ వంటి చిత్రాలతో మంచి దర్శకుడుగా గుర్తింపు పొందారు డైరెక్టర్ కరుణ కుమార్. ఈ రెండు చిత్రాలు మంచి విజయం అయిన తరువాత ఆయన తిరగకేస్తున్న తాజా చిత్రం కళాపురం. ఈ సినిమాని జి స్టూడియో అనర్ పై నిర్మించడం జరుగుతోంది. ఇక్కడ అందరూ కళాకారులే అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఇదొక మధ్యతరగతి మనుషుల కథ ఆధారంగా సమాజంలో జరిగే కొన్ని విషయాలు గురించి తెరకెక్కించారు ఈ సినిమాలో కీలకమైన పాత్రలు సత్యం రాజేష్, సంచిత పునాచ , కాషియా రఫీ తదితరులు నటిస్తూ ఉన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగావుతున్న ఈ సినిమా ట్రైలర్ ని నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తన ట్యాబ్ లో ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూస్తూ నవ్వుల్లో మునిగిపోయారు ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఒక మూవీ ట్రైలర్ చూస్తూ నవ్వడం అంటే అది విశేషం అని చెప్పవచ్చు దీంతో అభిమానులు సైతం చాలా సంబరపడిపోతున్నారు. ఇటీవల తనకి జ్వరం రావడంతో కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ రాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం అందరిని ఆకట్టుకుంటోంది.


ఇదంతా ఇలా ఉండగా కళాపురం సినిమా మొత్తం కరీంనగర్ లోని ధర్మపురి నేపథ్యంలో తెరకెక్కించాడు నట్లుగా తెలుస్తోంది ఇక ధర్మపురిలో 42 రోజులపాటు ఈ సినిమా షూటింగ్ చేసినట్లు సమాచారం ఈనెల 26న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అత్యంత అసభ్యరహితంగా సాగి సెటారికల్స్ చిత్రంగా ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. అదే ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ ను నవ్వించిన ఏకైక సినిమా ట్రైలర్ గా  పేరుపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: