టాలీవుడ్  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ కు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఊహించని స్థాయిలో ఆఫర్లు వచ్చేవి.  అయితే స్టార్ హీరోల సినిమాలలో మెజారిటీ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించేవారు.ఇకపోతే థమన్ నుంచి గట్టి పోటీ ఎదురైనా దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకున్నారు. అయితే ఇక గత కొన్నేళ్లలో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ అంతకంతకూ తగ్గుతూ వస్తోంది.ఇదిలావుంటే ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నా బాలయ్య అనిల్ కాంబో మూవీకి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కు ఛాన్స్ దక్కలేదు.

ఇకపోతే  థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండటం గమనార్హం. కాగా బాలయ్య నటించిన అఖండ సినిమాతో సోషల్ మీడియాలో థమన్ పేరు మారుమ్రోగింది.ఇక  థమన్ వల్లే అఖండ సినిమా ఊహించని స్థాయిలో హిట్టైందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.అయితే అఖండ సినిమా సక్సెస్ తో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీకి సైతం థమన్ కు ఛాన్స్ దక్కింది.కాగా  ప్రస్తుతం బాలయ్య అనిల్ కాంబో మూవీకి కూడా థమన్ కు ఛాన్స్ దక్కడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.అయితే  బాలయ్యకు థమన్ పై నమ్మకం పెరిగిందని అందువల్లే బాలయ్య సినిమాలకు డైరెక్టర్లు మారుతున్నా మ్యూజిక్ డైరెక్టర్ మారడం లేదని

 కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇదిలావుంటే ఇక బాలయ్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇకపోతే మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ కు సినిమా అవకాశాలు ఇచ్చే దర్శకులు అంతకంతకూ తగ్గుతున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని దృష్టి పెట్టని పక్షంలో ఆయన కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక దర్శకుడు సుకుమార్ మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ కు వరుస ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.!!

మరింత సమాచారం తెలుసుకోండి: