కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శృతి హాసన్ తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో భాగంగా శృతి హాసన్ ఎక్కువగా తెలుగు మరియు తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దుగుమ్మ , ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటు వంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అల్లు అర్జున్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది.

ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన వకీల్ సబ్ , క్రాక్ మూవీ లతో అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకున్న శృతి హాసన్ ప్రస్తుతం కూడా వరుస తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా శృతి హాసన్ సినీ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రోగ్రాం లో భాగంగా సినిమా ఇండస్ట్రీలో నటులకు సమానమైన గుర్తింపు నటీమణులకు దక్కదు అని, పారితోషికం కూడా వారితో సమానంగా ఉండదు అని గతంలో కొంత మంది నటీమణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దీనిపై మీ సమాధానం ఏమిటి అనే ప్రశ్న శృతి హాసన్ కి ఎదురయింది. ఈ ప్రశ్నకు శృతి హాసన్ జవాబు ఇస్తూ ... సమాజం మొత్తం కూడా అలానే ఉన్నందున సినీ పరిశ్రమని మాత్రమే అలా చూడడం కరెక్ట్ కాదు అంటూ శృతి హాసన్ తన సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: