ఇక ఇటీవల కాలం లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపిన చిత్రం కార్తికేయ 2..టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మొదటి నుండి ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కి గురి చేసింది..ఇక అలా భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే మంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. బింబిసార, సీతారామం వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్స్ గా నిలిచి టాలీవుడ్ కి పూర్వ వైభవం తెచ్చిన ఈ సమయంలో ఇక నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన హీరో నితిన్ మాచెర్ల నియోజకవర్గం సినిమాకి నెగటివ్ టాక్ వచ్చి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది.దీనితో ఇక బయ్యర్స్ కాస్త నిరుత్సహానికి గురైయ్యారు..అలాంటి వారికి ఊరటని ఇస్తూ ఈరోజు కార్తికేయ 2 మూవీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా వచ్చాయనే చెప్పాలి.ఇక ప్రస్తుతం నడుస్తున్న ఈ ట్రెండ్ ని బట్టి కార్తికేయ 2 మొదటిరోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఒక అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్ట్స్.ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ ఇంకా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో అదిరిపోయాయి..ముఖ్యం గా నైజం ప్రాంతం లో అయితే హైదరాబాద్ సిటీ మొదలుకొని చిన్న చిన్న సి సెంటర్స్ కూడా చాలా అద్భుతమైన ఆక్యుపెన్సీలతో ట్రేడ్ పండితులకు మతి పొయ్యేలా చేస్తుంది.


ఈరోజు నైజం ప్రాంతంలో కార్తికేయ 2 సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ ఇక ఇటీవల కాలంలో కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు కూడా రాలేదనే చెప్పాలి..కానీ మాచెర్ల నియోజకవర్గం, బింబిసారా, సీతారామం వంటి సినిమాలు థియేటర్స్ లో నడుస్తుండడం వల్ల కార్తికేయ 2 సినిమాకి థియేటర్స్ కొరత కొంచెం ఏర్పడింది.థియేటర్స్ దొరికిన సెంటర్స్ లో ఏమో తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్నవి అయితే వచ్చాయి.లేకపోతే ఈ సినిమా ఓపెనింగ్ కనీసం 7 కోట్ల రూపాయిలు అయిన ఉండేదని.కానీ ఇప్పుడు మాత్రం కేవలం 4 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే ఈ సినిమా వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల రూపాయలకు జరిగింది.సోమవారం నాడు కూడా సెలవు రావడం తో ఈ చిత్రం ఈ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఇక మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: