యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లలో సలార్ మూవీ ఒకటి . సలార్ మూవీ కి కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపు ను తెచ్చు కున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా , శృతి హాసన్మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం ఇప్పటికే అయి చాలా కాలమే అవుతుంది . ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది . ఈ మూవీ షూటింగ్ మరి కొద్ది రోజు ల్లోనే మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ అదిరిపోయే మెరిజి అప్డేట్ ని మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. సలార్ మూవీ నుండి ఒక అప్డేట్ ను ఆగస్ట్ 15 వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తాజాగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆగస్ట్ 15 వ తేదీన సలార్ చిత్ర బృందం ఈ మూవీ నుండి అలాంటి అప్ డేట్ ను విడుదల చేయబోతోందో చూడాలి. సలార్ మూవీ ని అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో మరొక ముఖ్యమైన పాత్రలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: