దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని  ఠాకూర్ హీరోయిన్ గా తాజాగా సీతా రామం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ,  లై , పడి పడి లేచే మనసు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే హను రాఘవపూడి ప్రేమ కథ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగి ఉండడం, అలాగే సీతా రామం మూవీ కూడా ప్రేమకథ చిత్రం కావడంతో ఈ మూవీ పై మొదటి నుండీ సినీ ప్రేమికులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

మూవీ పై మొదటి నుండి సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 16.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలో దిగింది. 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్  బాక్సా ఫీస్ బరిలో దిగిన సీతా రామం మూవీ ఇప్పటికే ఎనిమిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఎనిమిది రోజుల్లో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 20.51 కోట్ల షేర్ ,  40.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీంతో సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది రోజులకు గాను 3.51 కోట్ల లాభాలను అందుకని క్లీన్ పెట్టి గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: