టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. చివరిగా అల వైకుంఠపురం అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆయన తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా కూడా ప్రకటించారు.తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహేష్ 28వ సినిమా చేస్తున్నారు.అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్ మహేష్ బాబు అభిమానులను చాలా టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాలకు ఎక్కువగా హీరోలను రిపీట్ చేస్తూ ఉంటారు.ఇక అలా చేస్తూ అల్లు అర్జున్ తో మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి అలా వైకుంటఠపురంలో సినిమాలు చేస్తే మూడు సినిమాలు కూడా పెద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. అదే పవన్ కళ్యాణ్ తో ఆయన చేసిన జల్సా సినిమా సూపర్ హిట్ కాగా తర్వాత చేసిన అత్తారింటికి దారేది సినిమా కూడా మంచి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆయనతో చేసిన మూడో సినిమా అజ్ఞాతవాసి సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.


ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే ఆయనతో చేసిన అతడు సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వచ్చిన ఖలేజా మాత్రం కమర్షియల్ గా తీవ్ర స్థాయిలో నిరాశపరిచింది.. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందా అనే విషయం మీద సూపర్ స్టార్ మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో తీసిన రెండో సినిమా ప్లాప్ అయింది కాబట్టి మూడో సినిమాతో హిట్ ఇవ్వచ్చని వారు భావిస్తున్నారు. కానీ ఆ విషయం మీద మాత్రం మహేష్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు వినిస్తున్నాయి.అయితే వారి టెన్షన్ వెనుక మరో కారణం కూడా వుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలన్నీ కూడా ఒకేలాగా రొటీన్ గా ఉంటాయి. ఇక ఈ సినిమా కూడా రొటీన్ గా చాలా కష్టం. ఎందుకంటే జనాలు ఇప్పుడు చాలా కొత్త సినిమాలు ఆశిస్తున్నారు. వారి ఆశలకు అనుగుణంగా త్రివిక్రమ్ ఎలాంటి కథ రాస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: